Tuesday 27 November 2012

క్రియేటివ్ ఫ్రీడమ్

ఒక మళయాళీ చిత్రం తో సహా, మూడు ప్రాజెక్ట్ లు సెట్ చేసుకొని, ఇంక అంతా  ఓకే అనుకుంటున్న టైం లోనే, బంజారా హిల్స్ లో,  రోజు అర్థరాత్రి నాకు యాక్సిడెంట్ అయింది. సర్జరీలు, తర్వాతి బెడ్ రెస్టు, రికవరీలతో - చూస్తూండగానే దాదాపు ఒక సంవత్సరం గడిచిపోయింది. మళ్లీ ఇంకో పుట్టిన రోజు వచ్చింది. గడిచింది. పోయింది

నిన్నటి నా పుట్టిన రోజుకి కొంత ప్రాముఖ్యముంది. చాలా ఏళ్ల తర్వాత పుట్టిన రోజునాడు నేను అనుకున్నదే చేశాను. అనుకున్నట్టుగానే ఎంజాయ్ చేశాను. విచిత్రమేంటంటే, చాలా ఏళ్ల తర్వాత అలా చేయగలిగాను.

ఇంకో 365 రోజుల తర్వాత, నా మరో బర్త్ డే వచ్చేటప్పటికల్లా - సుమారు ఆరేళ్ల క్రితం నేను కోల్పోయిన నా క్రియేటివ్ ఫ్రీడమ్ ని మళ్లీ నూటికి నూరు శాతం తిరిగి తెచ్చుకోగలనన్న నమ్మకంతో ఇప్పుడు నేనున్నాను దిశలోనే నా పనులు, ప్రయత్నాలు ముమ్మరం చేశాను. నా గురించి నిజంగా బాగా తెలిసిన నాకత్యంత ప్రియమైన నా మిత్రులు, శ్రేయోభిలాషులు విషయంలో నాకు వారి సంపూర్ణ సహకారం అందిస్తారన్న నమ్మకం కూడా ఇప్పుడు నాకుంది.  

కానీ, ఆలస్యమంతా ఒక అతి చిన్న "స్టార్ట్ అప్" అమౌంట్ దగ్గరే జరుగుతోంది. అదే ఆశ్చర్యకరం! కానీ, విషయంలో కూడా - ఊహించని విధంగా మిత్రుని రూపంలోనో, మరే శ్రేయోభిలాషి రూపంలోనో - ఏదో మిరాకిల్ జరుగుతుందనీ, అదీ వారం లోనే జరుగుతుందనీ నా గట్టి నమ్మకం

ఏది ఎలా ఉన్నా - నేను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగిపోవడమే ఇప్పుడు నేను చేయగలిగిందీ, చేస్తున్నదీ. ప్రయత్నంలో ఊహించని ఏవేవో చిన్న చిన్న ఇబ్బందులు, అవాంతరాలు తప్పనిసరి. వాటిని ఎదుర్కొనే అనుభవం, మైండ్ సెట్, నెట్ వర్క్ నాకున్నాయి.   

ఇక - ఇప్పుడు నేను తెలుగులో ప్లాన్ చేస్తున్నసీరీస్ ఆఫ్ మైక్రో బడ్జెట్ కమర్షియల్ సినిమాలు’ నా కోసం నేను నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యం లో ఒక అతి చిన్న భాగం మాత్రమే. ఇంతకు ముందే, ఇదే బ్లాగ్ లో చాలా సార్లు, చాలా చోట్ల చెప్పినట్టుగా - సినిమాలే నా ప్రధాన వ్యాపకం గానీ, లక్ష్యం గానీ కాదు. నా ప్రధాన లక్ష్యాన్ని నేను చేరుకోడానికి సినిమాలు ఒక ప్లాట్ ఫామ్ మాత్రమే.

Thanks a million in advance to all my friends and well-wishers, for all your support and best wishes...

4 comments: