Sunday 25 November 2012

బిగ్ ఫైవ్ (Big 5)

సినీ ఫీల్డు లోకి నేను నేరుగా ఎంటర్ కాకముందు రాసిన పుస్తకంసినిమా స్క్రిప్ట్ రచనాశిల్పం’. ఫార్మాలిటీగా పుస్తకాన్ని ఎవరో ఒకరికి అంకితమిస్తే బాగుంటుంది అనిపించింది. ఆలోచించాను. వెంటనే నా యూనివర్సిటీ మిత్రబృందం "బిగ్ ఫైవ్" గుర్తొచ్చింది. బిగ్ ఫైవ్ కే పుస్తకాన్ని అంకితమిచ్చాను. (మిగిలిన నా ఇతర యూనివర్సిటీ మిత్రులను కూడా ఆ పుస్తకంలో గుర్తుచేసుకున్నాను. అది వేరే విషయం.)

ప్రతాప్ రెడ్డి, దయానంద్ రావ్, నేను, శేషాద్రి, రాందాస్ఉస్మానియా యూనివర్సిటీలో ఎం తెలుగు చదివినప్పుడు, మేం అయిదుగురం చాలా క్లోజ్. మా అయిదుగురిలో ఒక్కొక్కరు ఒక్కో విషయంలో ఎక్స్ పర్ట్! ఎం చదివిన రెండేళ్లూ మాదే హవా. పిక్నిక్ వెళ్లినా, టూర్ వెళ్లినా, చిన్న ప్రోగ్రాం ప్లాన్ చేయాలన్నా అది ముందు మా దగ్గరే డిసైడ్ అయ్యేది. వన్ ఫైన్ మార్నింగ్ - మాలో ఒకడు (రాందాస్మాగ్రూప్ కి "బిగ్ ఫైవ్" అని క్యాజువల్ గా నామకరణం చేశాడు. అదే అలా ఫిక్స్ అయిపోయింది.  క్లాసెస్ నడవాలన్నా, నడవొద్దన్నా, సెల్ఫ్ హాలిడేస్ డిక్లేర్ చేసుకోవాలన్నా, ఎవరినైనా ఏడిపించాలన్నా, చివరికి .. జీవితంలో ఎన్నడూ పాడని వాళ్ల చేత పూర్తి పాట పాడించి చప్పట్లు కొట్టించాలన్నా .. అన్నీ మేం అయిదుగురమే ప్లాన్ చేసి సక్సెస్ చేసే వాళ్లం.   

ఇక్కడే ఒక వాస్తవం కూడా చెప్పుకోవాలి. ఏవో చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప - మా ఎం క్లాస్ లోని మిగిలిన అందరి పట్ల కూడా మా అయిదుగురికీ అదే క్లోజ్ నెస్, అదే అభిమానం ఉండేది. ఇప్పటికీ ఉంది. కాకపోతే, మేం అయిదుగురమే అలా ఒక బ్రాండ్ తో (బిగ్ ఫైవ్) క్లోజ్ అయిపోవటం మా యాకూబ్ లాంటి ఇతర మిత్రులకు బాగా మండేది. వాడు అప్పుడప్పుడూ బయటపడి తిట్టేవాడు కూడా! వాడంటే మా అయిదుగురికీ చాలా అభిమానం. వాడు మాకు అందించిన ఆనాటి రొట్టమాకు రేవు (వాళ్ల ఊరు) అనుభూతిని ఇప్పటికీ మర్చిపోలేం. అనుభూతిని మరేదీ బహుశా రిప్లేస్ చేయలేదు. వాడే - ఇప్పటికవి యాకూబ్!”

మళ్లీ బిగ్ ఫైవ్ దగ్గరికి వద్దాం

బిగ్ ఫైవ్ కి గుండెకాయ మా దయానంద్ రావ్. ఆయన లేకపోతే నిజంగా బిగ్ ఫైవ్ లేదు. ఆయనే లేకపోతే, గత 27 ఏళ్లుగా మా ఎం మిత్రులందరం కలుసుకున్న ఎన్నో కార్యక్రమాలు, మీట్స్ లేవు. ఇంకా చెప్పాలంటే - అసలు మా ఎం మిత్రులందరం  ఒకరికొకరం మళ్లీ కలుసుకొనేవాళ్లం కాదు.

ఆయనకి ఒక్కటే తెలుసు. స్నేహం. ఒక్క పదం కోసమే అతని జీవితం. బహుశా ఇప్పటికీ అంతే. అదే అతని బలం, అదే అతని బలహీనత కూడాస్నేహం కోసం ఏమయినా చేస్తాడు. అవసరమయితే ఎవరినయినా, ఎంత  పరుషమయిన మాటలయినా అంటాడు..పడతాడు. మంచి భావుకుడు. నవలలు తెగ చదివేవాడు. యండమూరి నవలలంటే మరీ పడి చచ్చేవాడు. నచ్చిన కొటేషన్స్ ని డైరీల్లో అంత అందంగా రాసుకుంటారని ఆయన రాసుకున్న కొటేషన్ల డైరీలను చూశాకే నాకు తెలిసిందిఫ్రెండ్స్ కి రాసుకొనే ఉత్తరాలకోసం అందమయిన కలర్ లెటర్ ప్యాడ్స్ ని వాడతారని కూడా దయానంద్ దగ్గరి ఎన్నో అందమయిన లెటర్ ప్యాడ్స్ చూశాకే తెలిసింది నాకు.

మా ఎం మిత్ర బృందానికీ, ముఖ్యంగా మా బిగ్ ఫైవ్ కు, దయానంద్ సొంత ఊరు బుధ్ధారం ఒక ఫ్రీ హాలిడే స్పాట్ లా ఉండేది. అక్కడికి మేం ఎన్ని సార్లు వెళ్లామో, అక్కడ ఎంత ఎంజాయ్  చేశామో ... బహుశా రోజులు ఇక మళ్లీ రావు. రావు.

దయానంద్ రావ్ ని ముందు నేను తన పూర్తి పేరుతో పిలిచేవాణ్ణి. తర్వాత కొద్ది రోజులు అందర్లా "దయా" అని పిలిచేవాణ్ణి. తర్వాత "అన్నా" అని పిలుస్తూ దానికి ఫిక్స్ అయిపోయాను. అదేంటోగానీ, ఆయన కంటే పెద్దవాడయిన మా ప్రతాప్, నేనూ ఒరే అంటే ఒరే అనుకునేవాళ్లం. ఈయన్ని మాత్రం ఒరే అనే చాన్స్ నాకు ఇవ్వలేదు. కనీసం ఒక్క సారి, ఆయన బై మిస్టేక్ - ఒరే అని నన్ను అన్నా బుక్ అయిపోయేవాడు. తర్వాత ఎలాగూ తప్పేది కాదుకానీ, నిజానికి దీని వెనక ఇంకో కారణముంది .. 

“అన్న” నన్ను ఎప్పుడూ ఒక స్వంత తమ్ముడిలా చూసేవాడు. అలా ఫీలయ్యేవాడు. నా పట్ల తన ఫీలింగ్ ఇదీ అని నాకు చెప్పేవాడు చాలాసార్లు. తమ్ముడిపట్ల ఒక అన్న బాధ్యత ఎలా ఉంటుందో దాన్ని ప్రాక్టికల్ గా కూడా చాలా సార్లు ఆచరణలో చూపించాడు. అవి చాలా చిన్న విషయాలే కావొచ్చు. కానీ, వాటికి అంత గొప్ప విలువ నేనిస్తాను.

ఇక పర్సనల్ మేటర్స్ అంటే .. బహుశా నా స్నేహ బృందంలో, నాకు సంబంధించిన అన్ని సెన్సిటివ్ విషయాలు ఆయనకు తెల్సినంతగా మరెవ్వరికీ తెలీదు. ఆయన ప్రేమలూ, వైఫల్యాలూ, ఆకర్షణలూ అన్నీ నాకు తెల్సు. అవన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ ఒక విడదీయరాని భాగం.   నిజాన్ని నేను నమ్ముతాను

సుమారు
మూడేళ్ల క్రితం మా నాన్న మరణించేవరకూ నాకు ఎన్నో ఉత్తరాలు రాశాడు. ఉత్తరాల సంఖ్య ఒక రికార్డ్. అలాగే - నా ఎం రోజుల నుంచీ, ఇంటర్నెట్టూ-మొబైల్ ఫోన్స్ పాప్యులర్ కాకముందటి ఇటీవలి కాలం వరకూ,  'అన్న' నాకు రాసిన ఉత్తరాల సంఖ్య కూడా ఒక రికార్డ్.

మా
నాన్న తర్వాత నాకు అంత పెద్ద సంఖ్యలో  లెటర్స్ రాసింది ఈ అన్న ఒక్కడే

అలాంటి మా అన్నకీ నాకూ మధ్య కూడా ఒక చిన్న గ్యాప్ ఏర్పడటానికి కూడా పరోక్షంగా నా సినీ నేపథ్యమే కారణమయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు. దట్ ఈజ్ సినిమా! దట్ ఈజ్ లైఫ్!! 

2 comments:

  1. మీ పీజీ అయిపోయే చాలాకాలం అవుతున్నా...మీ జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉండడాన్ని బట్టే అర్థమవుతోంది. మీరెన్ని అనుభవాలు మూటగట్టుకున్నారో..
    మరిన్ని ఆసక్తికర అనుభవాలు మాతో పంచుకోరూ...ప్లీజ్

    ReplyDelete
  2. తప్పకుండా. కాకపోతే, వరుసగా అవే రాయటం అంత బాగుండదు కాబట్టి, మధ్య మధ్యలో తప్పక రాస్తుంటాను. మీలాంటి వాళ్లతో అప్పటి జ్ఞాపకాలు పంచుకుంటూ ఉంటాను. థాంక్ యూ!

    ReplyDelete