Friday 16 November 2012

ఫ్యాన్స్ ఇలా కూడా ఉంటారు!



మల్దోవాకి చెందిన వేరా అనే ఒక రష్యన్ యువతి అమితాబ్ బచ్చన్ కి వీరాభిమాని ...

(పాత సోవియట్ యూనియన్ నుంచి 1991 లో విడిపోయిన దేశాల్లో మల్దోవా ఒకటి.)

ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి. ఒకప్పుడు రష్యా లో నెహ్రూ కంటే రాజ్ కపూరే పాప్యులర్! దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రోజుల నుంచే, రష్యన్ దేశస్థులకు మన హిందీ సినిమాలూ, మన హీరోలూ, హీరోయిన్లూ బాగా తెలుసు.

ఇంతకీ ఈ బ్లాగ్ పోస్ట్ రాయటానికి కారణం ఇద్దరు రష్యన్ యువతులు.

వారిలో
ఒకరు వేరా.

మన
అమితాబ్ ను చూడ్డానికి యువతి 27 సంవత్సరాలు వెయిట్ చేసింది అంటే నమ్మగలరా

అమితాబ్ ను చూడ్డం కోసం - తను ఇండియా రావటానికి అవసరమయిన డబ్బు సమకూర్చుకోవటానికీ, తన ట్రిప్ కోసం నిత్య జీవితంలో ఉండే ఇతర అడ్డంకుల నుంచి కొద్ది రోజులు తనని తను ఫ్రీ చేసుకోడానికీ, వేరా కు 27 ఏళ్లు పట్టింది.

మధ్యే ముంభై వచ్చి అమితాబ్ ను కలవాలన్న తన కల నెరవేర్చుకుంది వేరా. తన రేంజ్ లో తనకి వీలయిన గిఫ్ట్ లతో పాటు, అమితాబ్ కోసం రష్యా నుంచి 27 గులాబీలను కూడా తెచ్చింది వేరా.

అదీ
ఆమె అభిమానం.

వేరా ఒకప్పటి సోవియట్ తరానికి చెందింది కాబట్టి అమితాబ్ పైన తన అభిమానాన్ని అలా చాటుకుంది.

కట్ చేస్తే - 

ఇప్పటి
అత్యాధునిక రష్యా కు చెందిన మరొక యువతి (ఆనా) అదే అమితాబ్ ను కలవటం కోసం ఫాస్ట్ ట్రాక్ మార్గం ఎన్నుకొంది.

తన
ఇండియా ట్రిప్ కోసం అవసరమయిన డబ్బు కోసం, డ్రగ్స్ డీల్ చేస్తూ పట్టుబడింది. జైలుకెళ్లింది. ఎంత బాధాకరం!

విషయం తెలిసిన అమితాబ్ - టీవీ క్రూ ద్వారా ఒక వీడియో  మెసేజ్ పంపిచాట్ట జైల్లో ఉన్న అమ్మాయికి.

ఇలాంటి
పని చేసే ముందు ఆలోచించాల్సింది అని. కనీసం తనకు ముందే తెలిస్తే, అమ్మాయిని ఇండియా రప్పించే ఏర్పాటు మరొకలాగా చేసి ఉండేవాణ్ణి అని ఆయన భావన.

రెండు ఉదాహరణల్లో ఉన్న పాజిటివ్, నెగెటివ్ కోణాల్ని పక్కనపెడితే - ఇద్దరు రష్యన్ ఫ్యాన్స్ ని కొందరు మన తెలుగు హీరోల ఫ్యాన్స్ తో ఒక సారి పోల్చిచూడండి

ఏమనిపిస్తోంది
మీకు

No comments:

Post a Comment