Monday 12 November 2012

మా మురుంకర్ సర్


ఓయూ లో నేను చదివిన మూడేళ్ల రష్యన్ డిప్లొమా లో నన్ను అమితంగా ప్రభావితం చేసిన మురుంకర్ సర్ గురించి నేను ఎంతయినా రాయగలను. కానీ, నేనలా చేయబోవటంలేదు. నా రష్యన్ క్లాస్ మేట్స్ ఎవరికీ తెలియనిదీ, సర్ మనసునీ, గొప్పతనాన్ని తెలిపేదీ అయిన ఒకే ఒక్క విషయం మాత్రం బ్లాగ్ పోస్ట్ లో తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను.

అది 1989 అనుకుంటాను. 72% మార్కుల డిస్టింక్షన్ తో నాకు BLISc లో గోల్డ్ మెడల్ వచ్చింది. అది నేను అస్సలు ఊహించని విషయం. నాకూ, రెండో ర్యాంకుకు మధ్య కనీసం 40 మార్కుల తేడా! ఇప్పటికీ అదే రికార్డ్ అని మా వాళ్లు చెప్తారు. అది వేరే విషయం.

గోల్డ్ మెడల్ వచ్చినందుకు అంతకు ముందటి నా MA క్లాస్ మేట్స్, నా BLISc క్లాస్ మేట్స్ అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. రాత్రి - నా MA క్లాస్ మేట్ రామ్దాస్, యూనివర్సిటీ  ఫుట్ బాల్ స్టేడియం పై అంచు మీదకి ఎక్కించి మరీ నాకు పార్టీ ఇచ్చాడు. ( పార్టీ గురించి మరో సారి ఇంకో బ్లాగ్ పోస్ట్ రాయాలి!) నా రష్యన్ డిప్లొమా క్లాస్ మేట్స్ కూడా బాగా అభినందించారు. యూనివర్సిటీ కేంటీన్లో, బయటా - వాళ్ల రేంజిలో వాళ్లు  "ట్రీట్"లు కూడా ఇచ్చారుఅప్పుడు చాలా ఇబ్బంది పడ్డ విషయం, ఇప్పుడు ఆలోచిస్తేనే నవ్వొచ్చే విషయం ఏంటంటే - అలా నాకు పార్టీ ఇచ్చిన నా రష్యన్ క్లాస్ మేట్స్ అంతా అమ్మాయిలే!

ఇదిలా ఉంటే - ఒక రోజు మా రష్యన్ క్లాస్ అయిపోయాక, మురుంకర్ సర్ నన్ను పక్కకి పిల్చి అడిగారు - "తర్వాతేంటి?" అంటూ. "ఏముంది సర్, ఏదయినా జాబ్ చూసుకుని చేరిపోతాను" అన్నాను సింపుల్ గా.

"లేదు, నువ్వు MLISc ఎంట్రన్స్ రాయి. నీకు సీట్ ఈజీగా వస్తుంది. అది పూర్తయ్యాక జాబ్ చెయ్యి" అన్నారు సర్.

అప్పటికే యూనివర్సిటీలో నాకు మూడేళ్లు నిండాయి. ఇంకో సంవత్సరం కష్టపడాలంటే నా వల్ల కాదనిపించింది. వెంటనే సర్ కి సమాధానం చెప్పలేకపోయాను ..

బహుశా మర్నాడు అనుకుంటాను. సర్ ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్న SBH బ్యాంక్ దగ్గర తన ట్రేడ్ మార్క్ అయిన పాత "ల్యాంబ్రెట్టా" స్కూటర్ పార్క్ చేస్తూ కనిపించారు. "జ్ద్రాఫ్ స్త్ వూయిత్సే!" అని రష్యన్ లో మామూలుగా ఎప్పట్లాగే విష్ చేశాను.

రమ్మంటూ, సర్ నన్ను తనతోపాటు బ్యాంకులోపలికి తీసుకెళ్లారు. అయిదు నిమిషాల్లో తన పని ఏదో ముగించుకున్నారు. తర్వాతలోపలే, అక్కడున్న బెంచీ మీద తన పక్కనే నన్ను కూర్చోమన్నారు. ఇబ్బందిగా ఫీలవుతూనే కూర్చున్నాను.

అప్పుడు, అక్కడ, సర్ నాతో మాట్లాడిన మాటలన్నిటినీ అక్షరం అక్షరం చెప్పలేను గానీ, వాటన్నిటి సారాంశాన్ని మాత్రం ఇక్కడ క్లుప్తంగా రాస్తున్నాను ..

"MLISc కోసం ఇంకో సంవత్సరం క్యాంపస్ లో ఉండి చదవటం నీకు ఆర్థికంగా వీలుకాదని నాకు అర్ధమవుతోంది. కానీ, నా మాట విని నువ్వు MLISc చదువు. 'MLISc కూడా అప్పుడే చదివుంటే నాకు ఇంకా మంచి జాబ్స్ వచ్చేవే' అని నువ్వు ఫ్యూచర్ లో బాధపడతావు. అలా పడకూడదనే చెప్తున్నాను. నీకు సీట్ తప్పకుండా వస్తుంది. చూస్తుంటే సంవత్సరం ఈజీగా గడిచిపోతుంది." అన్నారు సర్.

నేనేం చెప్పలేకపోయాను. అలాగే నిశ్శబ్దంగా ఉన్నాను ..

"నీకు కావాలంటే ప్రతినెలా పాకెట్ మనీ నేనిస్తాను. దాని గురించి నువ్వు వర్రీ కావొద్దు!" - అని, నెల నెలా తను నాకు ఇవ్వగలిగిన పాకెట్ మనీ ఎంతో ఒకఅంకె’ చెప్పారు. అంతకు మించి మాత్రం ఇవ్వలేనన్నారు.

కానీ నిజానికి, ఎక్కడో వరంగల్ నుంచీ; అందులోనూ, చదువు గురించి అసలు ఏమాత్రం తెలియని బ్యాగ్రౌండ్ నుచి వచ్చిన నాకు అదే ఒక పెద్ద అంకె!

సర్ చెప్పినట్టుగానే MLISc ఎంట్రన్స్ రాశాను. మొత్తం సీట్లు పది లోపే అయినా, టాప్ ర్యాంకులో నాకు సీట్ వచ్చింది. చేరిపోయాను. నిజానికి ఇదంతా నా క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా తెలియదు. ఏదో మామూలుగా అందర్లాగే, BLISc తర్వాత, MLISc చేస్తున్నాడు అనే అనుకున్నారంతా.

MLISc చదువుతున్న చివరి రోజుల్లోనే జవహర్ నవోదయ విద్యాలయ, గుంటూరులో నాకు మొదటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ లో చేరి పని చేస్తూనే, లీవ్ పెట్టి వచ్చి, ఇక్కడ హైద్రాబాద్ లో MLISc పరీక్షలు రాశాను.

మురుంకర్ సర్ రోజు నాకు బ్యాంకులో ఆఫర్ చేసిన ఆర్థిక సహాయాన్ని నేను తీసుకోలేదు. నా MA మిత్రుడు దయానంద్ రావ్ ద్వారా బర్కత్ పురా లో ఒక అబ్బాయికి హిందీ ట్యూషన్ చెప్తూ కొన్నాళ్లు, మరో పార్ట్ టైం జాబ్ చేస్తూ కొన్నాళ్లు అడ్జస్ట్ అవుతూ.. ఎలాగో సర్ చెప్పిన సలహాను పాటించి, MLISc చదివాను. అందులో కూడా  యూనివర్సిటీ టాపర్ గా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అది కూడా నేను అస్సలు ఊహించని విషయం.  MLISc ఉండటం వల్లనే తర్వాత నాకు ఆలిండియా రేడియో లో జాబ్ వచ్చింది .. 

మురుంకర్ సర్ మనసునీ, గొప్పతనాన్నీ తెలిపే ఇలాంటి ఉదాహరణలు నేనూ, నా రష్యన్ డిప్లొమా క్లాస్ మేట్స్ ఎన్నయినా చెప్పగలం ..

కుడి చేతికి ఉన్న తన వాచ్ ని ఎప్పుడూ అడ్జస్ట్ చేసుకుంటూ, అప్పుడప్పుడూ ఒక సిగరెట్ వెలిగిస్తూ, ఎంతో సింపుల్ గా, తన పాత గ్రీన్ "ల్యాంబ్రెట్టా" మీద తిరిగిన మా మురుంకర్ సర్ గురించి - మా బ్యాచ్ స్టూడెంట్స్ కి తెలిసినంతగా బహుశా మిగిలిన బ్యాచ్ వాళ్లకు తెలియక పోవచ్చునిజానికి మురుంకర్ సర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న స్టూడెంటయినా ఆయన్ని అంత సులభంగా మర్చిపోవటం జరగదు.

అలాంటి మురుంకర్ సర్ ని చాలా కాలంగా కలవలేకపోవడమనేది ఆయన విద్యార్థులెవరికయినా గిల్టీగానే ఉంటుంది. నా క్లాస్ మేట్ స్వరూపతో కలిసి, 22 ఏళ్ల తర్వాత,  మొన్న సర్ ని కలవడానికి వెళ్లినపుడు నేను ఫీలయిన గిల్టీ కూడా అలాంటిదే!    

5 comments:

 1. "గురుపూజోత్సవం","పప్పు-బెల్లం", ఇలాంటివన్నీ బహుశ ఇందుకే పెట్టారేమో మన పూర్వీకులు ... నిలబడి నీళ్ళు త్రాగటం కన్నా పరుగెత్తి పాలు త్రాగటమే మిన్న అనే ప్రస్తుత సమాజంలో ... తల్లి,తండ్రి, గురువు, మానవ సంబంధాలు ఎంత కావాలనుకున్నా... పాలను లీటర్లలోలా, మనుషులను "దూరం" గా ఉండడంతో కొలిచే .... అంటే ఎంత "దూరం"గా ఉంటే అంత గొప్పగా అందరూ భావించే ప్రస్తుత పరిస్థుతులలో ... ప్రతీ వ్యక్తీ "దూరం" పోదామనే ప్రయత్నించాల్సిన ఒత్తిడిలో ... సగటు విద్యార్ధి ఏం చేయగలడు తన గురువులను మధురస్మృతులుగా మార్చుకోవటం తప్ప!!! మీకు మురుంకర్ సర్ మరి మాకు...??? మార్గదర్శకులు... మనోహరమైన మోముతో.. చెరగని చిరునవ్వుతో.. చక్కని కలుపుగోలుతనంతో... గురువు... దైవం.. జీవన తుఫానులో కొట్టుకుపోతూ... “పాతిక” సంవత్సరాల వరకు మిమ్మల్ని కలవనందుకు క్షంతవ్యుణ్ని..... క్షమించండి మాష్టారూ..!!!

  ReplyDelete
 2. Thanks, Krishna. But I am sorry, I can't recollect who is this Krishna! I shall be happy if you tell something about you ... :)

  ReplyDelete
 3. Oh! Sir, really sorry, Usually my family, my school (upto 5th) friends,college friends call me krishna except at JNVM, and this is CH VKNSN Moorthy your student at JNVM.

  ReplyDelete
 4. క్రృష్ణ ఎవరా అని చాలా ఆలోచించాను. సి హెచ్ వి కె ఎన్ ఎస్ ఎన్ మూర్తి గానే నువ్వు నాకు బాగా తెలుసు. Anyways, very happy! Call me once when you have free time, my dear Krishna!! :)

  ReplyDelete
 5. k sir I hav just seen your message now, I will talk to you tomorrow sir

  ReplyDelete