Monday 15 October 2012

ఏది ఫెయిల్యూర్?

తెలుగు సినిమా ఇండస్త్రీ కి సంబంధించి నా లక్ష్యం చాలా చిన్నది. ఎన్నో చోట్ల, ఎన్నో విషయాల్లో ఎదురులేకుండా ముందుకు సాగిన నేను ఇక్కడ మాత్రం ఒక అతి చిన్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను. ఇట్ ఫీల్స్ రియల్లీ రియల్లీ బ్యాడ్. చాలా సార్లు.

కాని, ఇది ఫెయిల్యూర్ అని నేను అనుకోను. నిజానికి, మన ఫెయిల్యూర్ని నిర్ధారించేది బయటివారు కూడా కాదు. మనమే. మనం స్వయంగా అనుకున్నపుడే అది ఫెయిల్యూర్

ఇండస్ట్రీ చాలా విచిత్రమైంది. ఇక్కడ అనుకునేది ఒకటి. జరిగేది మరొకటి. ఇందుకు కారణాలు ఏవైనా కావొచ్చు. ఎవరైనా కావొచ్చు. కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే అన్ సర్టేనిటీ అనే ఒక్క కారణం వల్ల - ఇక్కడ చాలా మంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటిలా కనపడుతుంది.   

నిన్న అనుకోకుండా ఒక యువ దర్శకుడి ఆఫీస్ కి వెళ్లాల్సివచ్చింది. యువ దర్శకుడి ఖాతాలో ఆల్రెడీ ఒక మంచి హిట్ ఉంది. రెండో సినిమా ఒక పెద్ద హీరోతోనే చేశాడు. ప్రస్తుతం ఒక రేంజ్ లో ఉన్న యువ దర్శకుడతను. ఇప్పుడు ఇది తన నాలుగో సినిమా అనుకుంటాను .. 

విషయం ఏంటంటే - యువ దర్శకునికి బుధవారం నుంచి షూటింగ్  షెడ్యూల్ ఉంది. అంటే మధ్యలో కేవలం రెండే రోజులుంది. స్క్రిప్ట్ ఇప్పుడు రాసుకుంటున్నాడా దర్శకుడు! బహుశా అది ఫైనల్ వెర్షన్ అయిఉండొచ్చు. పరిస్థితులు అలా ఉంటాయి ఇండస్ట్రీలో. చివరి నిమిషంలోకూడా ఏదో ఒకటి ఊహించనిది జరుగుతుంటుంది ఇక్కడ. అలాంటి వాటిని ఎన్నింటినో తట్టుకుంటూ, ముందుకు సాగే కమిట్మెంట్ ఇండస్ట్రీ లో చాలా అవసరం. అలాంటి కమిట్మెంట్ ఉన్నవాళ్లలో కూడా కొందరినే అదృష్టం వరిస్తుంది. అదృష్టవంతులే "హిట్' ఇవ్వగలుగుతారు

యువ దర్శకుడు కమిట్మెంట్ తో తన పని తాను చేసుకుంటోంటే, అనవసరంగా మేం  వెళ్లి డిస్టర్బ్ చేసినట్టుగా ఫీలయ్యాను నేను

సమయంలో నే నాకో విషయం గుర్తుకొచ్చింది. ప్రధానంగా నేను ముందు రచయితని. రచయిత నుంచే దర్శకుడినయ్యాను. ఒక దర్శకుడిగా ఇప్పటివరకు నేను పనిచేసిన మూడు చిత్రాలకు కూడా, నా పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ఉపయోగించి స్క్రిప్టు రాసుకొనే అవకాశం నాకు దొరకలేదు! ఇందులో ఆశ్చర్యం లేదు. పరిస్థితులు అలాంటివి. ఇంకా, నిజం చెప్పాలంటే, నా మూడో చిత్రానికి అసలు నేను పేపర్ మీద పెన్ను పెట్టే అవకాశమే  దొరకలేదు. అలాగే, షూటింగ్ కి కొద్దిరోజుల ముందే నాకు యాక్సిడెంట్ కావటం తో - ప్రాజెక్టుకు నష్టం రాకుండా ఉండటం కోసం, ఇంకెవరితోనో సినిమా షూటింగ్ పూర్తిచేయాల్సి వచ్చింది. అయితే - టెక్నికల్ గా దర్శకుడిగా, రచయితగా పేరు మాత్రం నాదే ఉంటుంది! కొన్ని అంతే  - మన ఇష్టాయిష్టాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంటాయి.

మనం ఒక లక్ష్యం అనుకొంటాం. లక్ష్యాన్ని చేరుకొనే దిశలో ఎన్నో ఢక్కా మొక్కీలు తినాల్సివస్తుంది. వాటివల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఇంకా ఆలస్యం అవుతుండవచ్చు. అంత మాత్రాన మనం ఓడిపోయాం అనే ఎందుకు అనుకోవాలి? లక్ష్యాని సాధించే క్రమంలో ఒక్కో స్టేజిలో ఒక్కో ఛాలెంజ్ ను ఎదుర్కొంటూ ముందుకే వెళ్తున్నాం అని ఎందుకు అనుకోకూడదు

"ఓవర్ నైట్ సక్సెస్" అనే మాట మనం తరచూ వింటుంటాం. అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట. అసలు అలాంటిది లేదు. నిన్న నేను వెళ్లిన యువ దర్శకుడి ఆఫీస్ లో - పూరి జగన్నాథ్ ఫోటోతో పాటు ఆయన కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది“It took 15 years to get overnight success!”  అని. ఇదే కొటేషన్ను సుమారు పదేళ్ల క్రితం స్పిరిచువల్ మార్కెటింగ్ గురు (జో వైటలి) పుస్తకం లో చదివాను.

ఓవర్ నైట్ సక్సెస్ వెనక ఎన్నో కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు. వారికి కనిపించేవి రెండే రెండు విషయాలు. సక్సెస్, ఫెయిల్యూర్.

2 comments: