Monday 15 October 2012

సింగిల్ బెడ్ రూమ్ సినీ స్టూడియో


ఇవాళ ఒక డైలీ న్యూస్ పేపర్లో నాగార్జున ఇంటర్వ్యూ చూశాను. ఎలాంటి మాస్కులు, హిపోక్రసీ లేకుండా తన మనసులో ఉన్నది సూటిగా చెప్పే హీరో ఆయన. నాగ్ తీసుకొనే రిస్కీ ప్రొఫెషనల్ డెసిషన్లను నాకు తెల్సినంతలో మరే హీరోలూ తీసుకోలేరు. ఫిలిం హిట్టా, ఫట్టా అని కాకుండా, నా ఇమేజ్ .. నా ఫాన్స్ అని కాకుండా  - తనకు ఇష్టమయింది చేసుకుంటూ, స్టయిలిష్ గా  ముందుకు నడిచే మన్మథుడు నాగార్జున.

ఈ ఇంటర్వ్యూలోనే  ఒక ప్రశ్నకి సమాధానంగా - "ఇంకో నాలుగయిదేళ్లలో ఫిలిం మేకింగ్ అంతా డిజిటల్ మయమైపోతుంది" అన్నారు నాగార్జున. నూటికి నూరుపాళ్లూ నిజం అది. గుడ్డిగా దేన్నీ ఫాలో అవని నాగ్ కి ఆ నిజం తెలుసు కనుకనే అంత ఈజీగా చెప్పగలిగారు.

"ఫిలిం నెగెటివ్ మీద తీస్తేనే సినిమా" అని ఇండస్ట్రీలో అత్యధిక శాతం మంది భావన. 'రెడ్' కెమెరా తోనో, 'కేనన్' తోనో తీసిన సినిమాలు వాళ్ల దృష్టిలో అసలు సినిమాలే కావు! 'డిజిటల్ సినిమా' అని చిన్న చూపు చూస్తారు వీరంతా. ప్రపంచంలో సాంకేతికంగా వస్తున్న డెవెలప్ మెంట్స్ ఏంటి అన్న సాధారణ పరిజ్ఞానం ఉన్నవాళ్లు .. హాలీవుడ్ లోనూ, వరల్డ్ సినిమా లోనూ సాంకేతికంగా ఎన్నెన్ని మార్పులు ఎంత వేగంగా వస్తునాయో తెల్సినవాళ్లు, డిజిటల్ సినిమాను ఇంత చిన్న చూపు చూడలేరు. ప్రపంచవ్యాప్తంగా ఫిలిం మేకింగ్ లో వస్తున్న ఎన్నో డెవెలప్ మెంట్స్ ను గురించి ఇలాంటి వారంతా చాలా తెల్సుకోవాల్సి ఉంది.

ఈ సందర్భంలోనే అర్ధంలేని మరొక విషయం గురించి చెప్పుకోవాలి. నెగెటివ్ ఫిలిం తో తీసిన సినిమాతో పోలిస్తే, లేటెస్ట్ టెక్నాలజీతో డిజిటల్ లో తీసిన సినిమాకు టీవీ చానెల్స్ వాళ్లు కొనుక్కొనే "శాటిలైట్ రైట్స్" రేటు చాలా తక్కువగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీకి మనవాళ్లు ఇచ్చే విలువ అది! అలాగే, మన సెన్సార్ బోర్డ్ వాళ్లు కూడా "డిజిటల్ సినిమా" అని ప్రత్యేకంగా సర్టిఫికేట్ మీద రాస్తారు!

డిజిటల్ సినిమాని ఇలా డిస్కరేజ్ చేయటం వెనక అసలు కారణం వేరే ఉంది. కోట్లు పెట్టి ఎస్టాబ్లిష్ చేసిన ఎన్నో ల్యాబ్ లు, స్టూడియోలు ఈ డిజిటల్ ఫిలిం మేకింగ్ వల్ల మూతబడిపోతాయి. అసలు ఫిలిం నెగెటివ్ అనేదే లేకపోతే ఇంత పెద్ద ల్యాబ్ లూ, స్టూడియోలు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే, కేవలం సెట్స్ వేసుకోడానికి తప్ప ఈ స్టూడియోల అవసరం ఉండదు. ఆమాటకొస్తే - సెట్ లు ఎక్కడయినా వేసుకోవచ్చు. అసలు సెట్స్ అనేవే లేకుండా, నేచురల్ లొకేషన్లలో కూడా షూట్ చేయవచ్చు.

ఇక మిగిలింది - ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ పోస్టింగ్, రికార్డింగ్/రీరికార్డింగ్ వంటి ప్రి/పోస్ట్ ప్రొడక్షన్ పనులు. వీటి కొసం - కేవలం ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో రెండు లేటెస్ట్ కంప్యూటర్లు చాలు.

అంతదాకా ఎందుకు.. ఇటీవలే మన RGV కూడా కేవలం నాలుగున్నర రోజుల్లో తన "దొంగలముఠా" గురించి ఇక్కడ ముందే చెప్పి, చేసి మరీ చూపించాడు!  ఆ తర్వాత మన తెలుగులోనే వరసపెట్టి బోలెడు సినిమాలొచ్చాయి.వాటిల్లో కొన్ని రికార్డు కలెక్షన్లు సాధించాయి. ఉదాహరణలు మీకు నేను చెప్పనక్కర్లేదు.

సో .. ఇది నేనేదో ఊహించి రాస్తున్న విషయం కాదు. మైక్రో బడ్జెట్ లో, ప్రపంచవ్యాప్తంగా ఇలా తీసిన ఎన్నో సినిమాలు కమర్షియల్ గా భారీ కలెక్షన్లు సాధించాయి. మరెన్నో సినిమాలు కేన్స్, సన్ డాన్స్ వంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులూ, రివార్డులూ సాధించాయి. హాట్ కేక్స్ లాగా అక్కడ కూడా మార్కెట్ అయ్యాయి.

అసలు సినిమా తీసింది ఫిలిం నెగెటివ్ లోనా, డిజిటల్ లోనా అన్నది కాదు విషయం. సినిమాలో ఏ మాత్రం 'విషయం' ఉంది అన్నది ముఖ్యం. పైగా, ఫిలిం మేకింగ్ లో దూసుకొస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని హాలీవుడ్డే ఆపలేక, డిగ్నిఫైడ్ గా డిజిటల్ కు స్వాగతం పలికింది.  మనమెంత?

ఇవన్నీ నిజాలు. మనవాళ్లు కూడా ఎంత తొందరగా మేల్కొని లేటెస్ట్ టెక్నాలజీని ఆహ్వానిస్తే అంత మంచిది.

No comments:

Post a Comment