Monday 15 October 2012

పైరసీ లైఫ్


ఇంటర్నెట్ టెక్నాలజీ ఇంత బాగా అభివృద్ధి చెందాక - నాకు తెలిసిబహుశా ఇదే మొదటిసారి అనుకుంటాను .. ఒక తెలుగు సినిమారిలీజ్ అయి రెండు వారాలయినా, ఇంకా నెట్ లో ఫ్రీ డౌన్ లోడ్ కోసం టారెంట్స్ లోకి ఎక్కలేదు!

ఏవో చిన్న సినిమాలు, పేరులేని దర్శక నిర్మాతల సినిమాలు,బ్రాండ్ ఇమేజ్ లేని హీరోల సినిమాలు అయితే బహుశా ఎవరూపట్టించుకోరు అనుకుంటాను. ఈ సినిమాలేవీ టారెంట్స్ లోకనిపించవు. గొడవే లేదు.

 కానీ, ఇటీవలి కాలంలో ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉన్న ప్రతి పాప్యులర్ సినిమా కూడా రిలీజ్ అయిన 24 గంటల లోపే నెట్లోకి ఎక్కుతోంది. అలాంటిది .. యూత్ లో మంచి పాజిటివ్ పాప్యులారిటీ ఉన్న శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్బ్యూటిఫుల్’ రెండువారాలపాటు నెట్ లోకి ఎక్కలేదు అంటే నిజంగా గొప్ప విషయమే! అయితే దీనర్ధం - పైరసీప్రియులు (అప్ లోడర్స్) తమ పని మానుకున్నారని కాదు. వాళ్ల పని వాళ్లు చేయాలనుకున్నా - ఆ పప్పులుఉడక్కుండా అడ్డుకోడానికి ఒక యంత్రాంగాన్ని విజయవంతంగా నడిపించిన ఘనత శేఖర్ దేనని నిన్న ఒక పేపర్లోచదివాను.
'ఎంటర్ సాఫ్ట్' అనుకుంటాను ఆ కంపనీ పేరు ..  పైరసీ ప్రియుల ద్వారా తన సినిమా టారెంట్స్ లో ఫ్రీ డౌన్ లోడ్ కిరాకుండా చూసే బాధ్యతను ఈ కంపనీ కి అప్పగించారు శేఖర్. ఆ బాధ్యతని విజయవంతంగా రెండు వారాలపాటునిర్వర్తించగలిగింది ఆ కంపనీ. ఫేక్ టారెంట్స్ ని సృష్టించి, తద్వారా 'టెక్నికల్లీ సౌండ్' అయిన అప్ లోడర్స్ నిపట్టుకున్నారని తెలిసింది. ఆ కంపనీని  నిజంగా మెచ్చుకోక తప్పదు. సుమారు 250 వరకు కేసులుబుక్కయ్యాయట. ఇదంత చిన్న విషయమేంకాదు.
పైరసీని ఆన్ లైన్ లో అడ్డుకోవటంలో సక్సెస్ సాధించినట్టే, ప్రయత్నిస్తే బయట ఆఫ్ లైన్ లోనూ సులభంగా సక్సెస్చేయవచ్చు. దీనికోసం కావల్సింది ప్రెస్ లో ఉట్టుట్టి ప్రచారం, ఫోటోలు కాదు. రియాలిటీలో ఎలాగయినాసరే దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి. ఈ విషయంలో మొదటిసారిగా విజయవంతంగా ఒక అడుగు ముందుకు వేసి చూపించిన శేఖర్ కమ్ములను అభినందించక తప్పదు.

(8th October 2012)

No comments:

Post a Comment