Monday 15 October 2012

గుడ్ బై, నగ్నచిత్రం!


నా సినిమా ప్రొఫెషన్ కి సంబంధించి నేనుక్రియేట్ చేసుకోదల్చిన నెట్ వర్క్ కోసమనేప్రత్యేకంగా నగ్నచిత్రం బ్లాగ్ ని ముందుప్రారంభించాను. బ్లాగ్ టైటిల్ ని కావాలనేఅలా పెట్టాను. నా టార్గెట్ సినిమావాళ్లేకాబట్టి ఈ టైటిల్ ఓకే అనుకున్నాను. ఒకరకంగా ఇదో మార్కెటింగ్ జిమ్మిక్. తర్వాత అదే బ్లాగ్ ని నా మెయిన్ బ్లాగ్ గాచేసుకుని అన్నీ అందులోనే రాయటంప్రారంభించాను.

"చాలా మంది విజిట్ చేస్తున్నారు .. అంతా బానే ఉంది" అని సైట్ మీటర్ చూస్తూ అనుకుంటుండగా ఓ కాల్వచ్చింది. ఆది నాకు అత్యంత ప్రియమైన నా విద్యార్థి నుంచి. మా మాటల్లో బ్లాగ్ టాపిక్ కూడా వచ్చింది. సారాంశంఏంటంటే - అమ్మాయిలు, స్త్రీలు, మగవాళ్లలో కూడా కొందరు అసలు ఈ బ్లాగ్ లింక్ మీద క్లిక్ చేయటానికి కూడాఇష్టపడటం లేదని!   కారణం - బ్లాగ్ టైటిల్ ‘నగ్నచిత్రం’ కావటం!! 

నిజానికి ఆ బ్లాగ్ లో అసభ్యకరమైనది ఏదీ లేదు. అందులో నేను రాస్తున్న నగ్నత్వం శరీరానికి సంబంధించింది కాదు. హిపోక్రసీ లేని నిజాలు. ఇది కూడా అందరికీ తెలిసిందే. అయినా సరే, కొందరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. అలాగని వాళ్లని తప్పు పట్టాల్సిన పని లేదు. మన కండిషనింగ్ అలాంటిది. 

నన్ను నేను ఎనలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలాగూ నా ప్రధాన లక్ష్యం తెలుగు సినిమాలు కాదు కాబట్టి, ఆటైటిల్ కోసం అనవసరంగా 50 శాతం మంది విజిటర్స్ ని ఎందుకు పోగొట్టుకోవాలి? సో, కొంచెం శ్రమే అయినా తప్పదు.ఆ బ్లాగ్ లో ఇప్పటిదాకా రాసిన పోస్టులను అన్నింటినీ దీన్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నాను.

ఒక రచయిత బ్లాగ్ కి తన పేరుని మించిన మంచి  టైటిల్ ఇంకేముంటుంది?

(8th October 2002)

1 comment: