Wednesday 3 October 2012

ఆత్మీయ నవోదయమ్

అనుకున్నట్టుగానే సరిగ్గా 23 ఏళ్ల తర్వాత - అదే రోజు - సెప్టెంబర్ 28 నాడు, నేను ఉద్యోగంలో జాయిన్ అయి, రెండేళ్లపాటు పనిచేసిన జవహర్ నవోదయ విద్యాలయకి మా పెద్దబ్బాయి ప్రణయ్ తో కలిసి వెళ్లాను.

ఇదేమంత
గొప్ప విషయం కాకపోవచ్చు.

కానీ
, జీవితంలో నిజమైన ఆనందం అనేది ఇలాంటి చిన్ని చిన్ని అనుభూతుల్లోనే ఉంటుందన్నది రోజుల్లో అందరూ మర్చిపోతున్న వాస్తవం.

29, 30 తేదీల్లో జరిగిన సిల్వర్ జుబ్లీ వేడుకలు నిజంగా ఒక అద్భుతం. విద్యాలయలో ప్రస్తుతం చదువుకొంటున్న విద్యార్థులు, ఉంటున్న స్టాఫ్ కాకుండా - సుమారు 18 బ్యాచ్ పాత విద్యార్థులు, స్టాఫ్ ఒకే చోట కలవటం నిజంగా ఒక వేడుకే. ఇలా వచ్చిన వందలాదిమందికి వసతి, భోజనం యేర్పాటు చేయటం అంత చిన్న విషయమేం కాదు.

ఇదంతా
ఒక వైపు ..

కాగా
, మరోవైపు సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్టేజీ అలంకరణ, లైట్స్సౌండింగు, శాలువాలు, మెమెంటోలు, పూలు, దండలు .. ఇలా యెన్నో పనులు.

బృహత్ కార్యక్రమాన్నంతా అత్యంత విజయవంతంగా జరపగలగటం అనేది - అక్కడ మద్దిరాలకు దగ్గరలో రాజా (డాక్టర్ రాజశేఖర్ బాబు) ఉండటం వల్లే సాధ్యమయిందన్నది ఎవరూ కాదనలేని నిజం. నాగరాజు, సురేష్ (డాక్టర్ సురేశ్ బాబు), రమా దేవి మొదలైనవాళ్లంతా ఎప్పటికప్పుడు రాజాతో కో-ఆర్డినేట్ చేసుకుంటూ బాగా కష్టపడ్డారు. కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు.

అలాగే - విద్యాలయలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులందరూ కూడా కార్యక్రమం ఏర్పాట్లలో బాగా సహకరించారు. సహకరించని వారు కూడా కొందరున్నారు. అయితేఅలాంటి నెగెటివిటీని అస్సలు పట్టించుకోలేదు మనవాళ్లు!

అంతా మనమే, అంతా మనదే' అన్నట్టుగా ముందుకే నడిచి పని కానిచ్చేశారు. ఇది నిజంగా గొప్ప విషయం.  

ఇక, వెనకే ఉండి, ఎప్పటికప్పుడు ఫోన్లోనే తన సలహాలతో వీరందరినీ ముందుకు నడిపించిన నా కలీగ్, మిత్రుడు లక్ష్మినారాయణ (PET) ను అభినందించకుండా ఎలా ఉండగలను?

భరత్, కవిత, సజ్జా, బోడా, సత్యం బాబు, చంద్రశేఖర్, దుర్గారామ్, మమత, సౌజన్య, వీణ, విద్య, చైతన్య, సూరం మాధవి, లీల, వాక్దేవి వంటి కొందరు వెరీ పాప్యులర్ విద్యార్థులను ఈవెంట్ లో కలుసుకోలేకపోవటమొక్కటే నేను బాగా ఫీలయిన లోటు. త్వరలోనే మరేదైనా ప్రత్యేక సందర్భంలో వీరందర్ని కూడా చూస్తానని నా నమ్మకం.   

నేను కలిసి పని చేసిన టీచర్లలో - హైమవతి, జ్యోతి, రుక్మిణి మేడమ్లు; విజయసారథి, బాలసుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, స్టీఫెన్ పాల్ మొదలైన కొందరిని మిస్సయ్యాను.     

విద్యాలయ నేపథ్యం అనే పునాదిమీదే ఎదిగిIAS ఆఫీసర్ అయిన రాఘవ, డాక్టర్ రాజశేఖర్ బాబు .. వీరిద్దరి స్పీచ్ లు ఈ ప్రోగ్రాం మొత్తానికే హైలైట్. అప్పటి 'ఆల్ రౌండర్' ఉషా రాణి (ఇప్పుడు, డాక్టర్ ఉష) యాంకరింగ్ కూడా ప్రోగ్రామ్ మొత్తానికి ఒక అందమైన నిండుదనాన్ని ఇచ్చింది.

నా ఇతర హాబీలూ వ్యాపకాలూ ఎలా ఉన్నా - మరిన్ని విశేషాలతో, కొన్ని సర్ ప్రైజ్ లతో, ‘ఆత్మీయ నవోదయమ్ – 2’ బ్లాగ్ పోస్ట్ తో మరో రెండు రోజుల్లో మీ ముందుకి వస్తాను.

4 comments:

 1. I will be eagerly waiting for your next blog sir..

  ReplyDelete
 2. It's very difficult to put things in simple language and you are a master Manohar Sir! I liked the quote on diamonds vs stones...

  ReplyDelete
 3. Thanks for your compliment, Bharath! I am waiting for some of my diamonds to come out of the box.. and the soonest ... :)

  ReplyDelete
 4. And I missed to give response to you, Sajja, thanks.. thanks for ur comment. :)

  ReplyDelete