Tuesday 2 October 2012

3 సినిమాలు, 9 నెలలు


నాకు అబద్ధం చెప్పటం చేతకాదు. ఒక వేళ అలాంటి పరిస్థితే వస్తే అసలు ఏదీ చెప్పను. లేదా, సింపుల్ గా  అక్కడినుంచి తప్పుకుంటాను. ఈ 'బలహీనతే' నా జీవితంలో చాలా కష్టాలను కొని తెచ్చుకోడానికి ఒక ప్రధాన కారణమయింది ..

ముఖ్యంగా - సినిమా ఫీల్డులో మేనిప్యులేషన్స్ అనేవి చాలావరకు తప్పనిసరి. ఆంటే - ఒకటి చెప్పటం, 
రొకటి చేయటం అన్నమాట! లేదంటే - అసలు ఏమీ చేయకపోవటం!!

ఇంకో రకం మేనిప్యులేషన్ ఏంటంటే - అర చేతిలో వైకుంఠం చూపి, చివరకు ""
"ఏంటి .. నేను అలా అన్నానా!" అని అమితంగా ఆశ్చర్యపోవటం .. ఎదుటి వాడిని ఫూల్ చేయటం .. చివరికి, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో - వాడి జీవితం రోడ్డు ఎక్కడానికి కారణం అవటం ..

అయితే, ఈ మేనిప్యులేషన్స్ విషయంలో నేను "వెరీ పూర్” అని చెప్పుకోడానికి నాకు ఎలాంటి భయం లేదు. ఈ బలహీనతనే నా బలంగా చేసుకోడానికి యెంతో ట్రై చేశాను. కానీ, నా వల్ల కాలేదు. నా ప్రధాన లక్ష్యం 'తెలుగు సినిమాలు కాదు' కాబట్టి ఎలాగో  నెట్టుకు వస్తున్నాను.

ఏది ఎలా వున్నా - తెలుగులో ఇంకో 3 సినిమాలు చేయటం వ్యక్తిగతంగా నాకు చాలా అవసరం. 2013 మార్చి నుంచి ప్రారంభించబోతున్న సీరీస్ కు ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాను. సీరీస్ లో  తొలి సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి - సరిగ్గా 9 నెలల్లో ఈ 3 సినిమాల సీరీస్ని పూర్తి చేయాలి!

ఈ డెడ్ లైన్ కు ఎలాంటి సవరణలు 
వుండవు, వుండకూడదు, వుండబోవు.

అయితే - సీరీస్ లో మొదటి సినిమా ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఇప్పుడే చెప్పటం 
ప్రాక్టికల్ గా  కొంచెం కష్టం. ఎందుకంటే, నేను ఇదివరకటిలాగా చాలా విషయాల్లో కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. అందుకే సీరీస్ లో ఫస్ట్ సినిమా ఎప్పుడు అన్నది అంత ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేను. నా అంచనా మాత్రం - ఈ డిసెంబర్ లోపు అంతా కన్ ఫర్మ్ అయిపోతుందని. ఇది స్టార్ట్ అయిందంటే చాలు - మిగిలిన రెండూ ఆటొమేటిగ్గా డెడ్ లైన్ లోపు అయిపోతాయి. 

మా గుంటూరు 'నవోదయ సిల్వర్ జుబ్లీ’ నుంచి రాగానే - నేను ప్రారంభించిన మహా యజ్ఞం ఇది. ఇక యజ్ఞం అన్నపుడు ఊహించని అవాంతరాలు తప్పనిసరి. నేనూ రెడీగానే వున్నాను. ఈ సారి నాకు ఉన్న/నా ఆలోచనకు వచ్చిన ప్రతి సోర్స్ నీ ఉపయోగించుకోదల్చుకున్నాను కాబట్టి - పెద్దగా ఇబ్బందులేవీ రాకపోవచ్చు. రానీయను కూడా.

పూర్తిగా కొత్త ఆర్టిస్టులతో - నేను ప్లాన్ చేస్తున్న ఈ 3 కమర్షియల్ సినిమాలూ యూత్ ని టార్గెట్ చేసి తీస్తున్నవే. తప్పనిసరి అయితేనే, ఒకరో ఇద్దరో పేరున్న ఆర్టిస్టులను తీసుకోవచ్చు. కొత్తవారితో తీస్తున్న ఈ మైక్రో బడ్జెట్ సినిమా లకు బడ్జెట్ సమకూరటం అంత పెద్ద సమస్య కాదనే నా నమ్మకం.

అంతకు ముందు నేను పని చేసిన మూడు చిత్రాలకు మూడు రకాల చరిత్ర ఉంది. ఏ ఒక్క సినిమా విషయం లోనూ నా క్రియేటివ్ టాలెంట్స్ ను కనీసం 10% ఉపయోగించే అవకాశం నాకు కుదర్లేదు/దక్కలేదు. ప్రస్తుతం నేను చేయబోతున్న ఈ మూడు సినిమాల విషయంలో మాత్రం నేను మరీ అంత కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. ఈ మూడు సినిమాల్లో కనీసం ఒక్కటయినా హిట్ అయి తీరాలి. అప్పుడే నా ప్రధాన లక్ష్యం వైపు నేను వెళ్లటం చాలా ఈజీ అవుతుంది.
 

సినీ ఫీల్డు పట్ల ఆసక్తి ఉన్న లైక్ మైండెడ్ ఇన్వెస్టర్లు, కొత్త నిర్మాతలు ముందుకు వస్తే - కేవలం ఔత్సాహిక నూతన నటీ నటులతోనే - ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, మంచి క్వాలిటీ తో, అతి తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన కమర్షియల్ సినిమాలు తీయవచ్చు.
దాని కోసమే ఇదంతా ... అలాంటి వారి కోసమే ఈ అన్వేషణ, ఈ బ్లాగ్ పోస్ట్ ...

2 comments: